
రౌండ్ టేబుల్ సమావేశం
అందాల పోటీలకు 55 కోట్లా?
తెలంగాణ కళాకారులకు గాడిదగుడ్డా..?
అనే అంశంపై …
రౌండ్ టేబుల్ సమావేశం
ఏప్రిల్ 23న బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టి పి ఎస్ కే హాల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్‌లింగంపల్లిలో జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం 73వ అందాల పోటీలకు (మిస్ వరల్డ్ పోటీలకు) మన హైదరాబాదు వేదిక కానున్నదని అన్నారు హైదరాబాద్ కు 430 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన నగరం అని ప్రేమ నగరం గా భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి నగరం గా అన్నింటికంటే స్త్రీలను గౌరవించే నగరంగా కళా వారసత్వం నగరమైన హైదరాబాదులో అందాల పోటీలను నిర్వహించి హైదరాబాదును ఏ నగరంగా మార్చబోతున్నారని ప్రశ్నించారు ?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందాల పోటీలు అంటే ? అర్థం ఏమిటో చెప్పగలరా ? అని ఘాటుగా ప్రశ్నించారు అంగాంగ ప్రదర్శనలతో స్త్రీల శరీరాలను అవమానించడం కాదా ? అందాల పోటీల పేరుతో అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం సిగ్గుమాలిన నీతి మాలిన చర్యగా అభివర్ణించారు తెలంగాణలో అసలే ఆర్థిక సంక్షోభం ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లకే దిక్కులేదు కానీ ..అందాల పోటీలా..? ఈ అందాల పోటీల ద్వారా తెలంగాణకు ఏం తెస్తారో….
సవివివరంగా వివరాలు పెట్టాలని డిమాండ్ చేశారు 12 సంవత్సరాలుగా కళాకారులు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం TPSK గత కొంత కాలంగా ఆందోళనలు, వినతి పత్రాలను సమర్పించారు అయినా….
తెలంగాణ తెచ్చిన కళాకారులకు పట్టెడన్నం పెట్టే పథకం తేలేదు కానీ 55 కోట్లు ఖర్చుపెట్టి అందాల పోటీలను నిర్వహిస్తున్నారా ఇది అవమానకరం గాదా అందుకే హైదరాబాద్ మే 7 నుంచి 31 వరకు నిర్వహించ తలపెట్టిన 73వ ప్రపంచ సుందరి అందాల పోటీలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు
తెలంగాణ సినిమా జానపద జె ఎ సి చైర్మన్ మురళీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ ఊరూరా నిరసనల మధ్య ఆందోళనల మధ్య అందాల పోటీలను నిర్వహించి, ఏం సాధిస్తారు ? పైగా మనది హిందూ ధర్మ పరిరక్షణ అని గొప్పగా చెప్పుతారు హిందూ ధర్మ పరిరక్షణ అంటే విదేశీ యువతుల అందాల ఆరబోతను చూసి తెలంగాణ ప్రజలను తరించండి అని చెప్పడమా ? పాలకులు కనీసం ఆలోచించట్లేదని అన్నారు
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హైదరాబాద్ కమిటీ కన్వీనర్ జి . నరేష్ మాట్లాడుతూ
ఒకవైపు హైదరాబాద్ సెంటర్ గా ‘డ్రగ్స్ మాఫియా’గా మారితే అరికట్టలేని పాలకులు అందాల పోటీలతో తెలంగాణ యువతను ఎటువైపు నెట్టివేయాలని అనుకుంటున్నారో..తెలియజేయండి అని అన్నారు కుర్ర రవీంద్రర్ గౌడ్ జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ మరియు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రకటనలు చేస్తూ.. వ్యాసాలు రాస్తున్నారు వారి వ్యాఖ్యానాలు మహిళలను కించపరిచే విధంగా అవమానకరంగా ఉన్నాయని అన్నారు .
కె. నీర్మల, పరపతి సంఘాల అధ్యక్షులు అందాల పోటీలను నిర్వహిస్తే 120 దేశాలకు ఆతిథ్యము ఇచ్చినట్లు అని ఆతిథ్యమిస్తే .. అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు తో తెలంగాణ స్థానిక వ్యాపారాలు పెరుగుతాయి చేనేత హస్తకళలు కళారూపాలు ప్రపంచానికి పరిచయం చేస్తామని అని ప్రకటించారు తెలంగాణ ప్రజలారా.. ఆలోచించాల్సిన అంశం ప్రపంచ దేశాలు అందాలను ఆరబోసే వాళ్ళు చేనేత చీరలు కట్టుకుంటారా. ?
అనేక దేశాలలో ప్రపంచ అందాల పోటీలు జరిగాయి కదా ఒక దేశ బ్రాండ్ ను మార్కెట్ చేయడం ఎక్కడైనా ఏ దేశంలో అయినా జరిగిందా ..?
అని సవాల్ విసిరారు బొయ గోపి వాల్మీకి బోయ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ చేతివృత్తులకు చేనేతకు చేయూత గ్యారెంటీ చేస్తారా వాళ్లతో పోచంపల్లి చీరల్ని కట్టిస్తారా తెలంగాణ కళాకారులకు తాగనీకు గంజి ఇచ్చే సంక్షేమ పథకం లేదు కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది “మింగ మెతుకు లేకున్నా మీసాలకు సెంటు” అన్నట్లు కేంద్ర రాష్ట్ర సర్కారుల మాటలు ఉన్నాయి అని అన్నారు అమ్మను గౌరవించే తెలంగాణ రాష్ట్రంలో అమ్మను ఆట వస్తువుగా విలాస వస్తువుగా భోగ వస్తువుగా చూసే సంస్కృతిని తెలంగాణ పాలకులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు
తెలంగాణ కళాకారులమైన మేము సమస్త ప్రజల్ని ,యువత ను మహిళా సంఘాలను కలుపుకొని మే 7 నుంచి జరిగే ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తాం నిరసన ఆందోళనలో పాల్గొంటాం తస్మాత్ జాగ్రత్త అని పాలకులను హెచ్చరించింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో డాక్టర్ తిరునగరు స్వామి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పౌర హక్కుల నేత తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రం హైదరాబాద్ సౌత్ కన్వీనర్ మహేష్ దుర్గే సావిత్రిబాయి పూలే పౌండేషన్ సి పరమేశ్వరి మాదర బోయిన నరసయ్య ఎమ్మార్పీఎస్ ప్రెసిడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఎం వేణుగోపాల్, ఎన్ రాఘవేంద్ర పి డి ఎస్ యు సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు