అందరినీ ప్రేమించు-ఎవ్వరిని ద్వేషించకు
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి ప్రచార దినోత్సవాన్ని శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.“అందరినీ ప్రేమించు-ఎవ్వరిని ద్వేషించకు”అనే నినాదంతో ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మానవసేవ కార్యక్రమాలు కూడా చేపట్టారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220కు పైగా దేశాలలో శాంతి,సౌభ్రాతృత్వం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జిల్లా ఇన్చార్జ్ మహమ్మద్ యాకుబ్ పాషా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా సంబంధాల ప్రతినిధి మహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా నేతృత్వం వహించారు.కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.