అగ్గిలాంటి రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి
అగ్గి లాంటి రచనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో తన కవిత్వాలతో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి ప్రజా కవి కాళోజి నారాయణ రావు అని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్,మంద శ్రీకాంత్ అన్నారు.కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా మంగళవారం రోజున హనుమకొండ నగరంలోని నక్కల గుట్టలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణ రావు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తన గొప్ప గొప్ప కవితలతో ప్రజల్లో విద్యార్థుల్లో యువతల్లో ఉద్యమ చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అయినా కవిత్వాలు ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసాయి అని అన్నారు. ఆయన జీవితాంతం పీడిత ప్రజల గలమై బలమై అధికార రాజ్యంపై తన దిక్కర స్వరన్ని వినిపించారు అని అన్నారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నడవడిక ఆచార వ్యవహారాలు సంస్కృతి సాహిత్యంలో తన చెరగని ముద్రను వేశారు అని కొనియాడారు. నేటితరం యువత విద్యార్థులు కాలోజి నారాయణరావు గారిని ఆదర్శంగా తీసుకొని తన ఆశయాల కోసం ముందుకు నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్,జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయి కుమార్,పవన్ కుమార్,మల్లేష్,నాగరాజ్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.