
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నేతలు
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల కు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీలో సంవత్సరాల నుండి పనిచేస్తున్న అదనపు కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు): జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందజేసినట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు తెలిపారు
ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు జీవో నెంబర్ 51 సవరించాలని కోరారు కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని తీవ్రంగా మండిపడ్డారు జనగామ జిల్లాలో గ్రామపంచాయతీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకుండా అధికారులు చేసిన పొరపాటుకు అదనపు కార్మికులను బలి చేస్తున్నారని సరైన పద్ధతి కాదని అన్నారు అదనపు కార్మికులను మీరు పని చేయకండి మీకు జీతాలు ఇవ్వం మీ ఇష్టం అన్నట్లు పంచాయతీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని అదనపు కార్మికులను వేధించే అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాల అవసరాల మేరకు గ్రామ సభలలో తీర్మానాలు చేసి గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు నియమించుకున్న కార్మికులను చిన్న చూపు చూడడం వారిని మానసికంగా ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులను రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకో రావాలన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు యూనిఫామ్ సబ్బులు నూనెలు ఇవ్వాలన్నారు గ్రామపంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ పిఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించకుంటే సమ్మెబాట పట్టక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం జిల్లా నాయకులు బస్వ రామచంద్రం ఏ సాంబయ్య ఎన్ యకన్న సంగీ కరుణాకర్ డి నాగరాజు వెంకటరెడ్డి కే సోమన్న కే రాజు తదితరులు పాల్గొన్నారు