అన్ని వర్గాల అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే రెడ్యానాయక్
Mahabubabadఆదరించండి డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడిని అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు.మరిపెడ మండలంలోని పాంబండ తండా,తాళ్ల ఊకల్,రూప్ సింగ్ తండా,వెంకంపాడు,బావోజి గూడెం,రాంపురం,చిల్లంచర్ల,నేతావత్ తండా,నీలికుర్తి,ఎల్లంపేట,లక్ష్మ తండా,సోమ్లా తండా,బోటియ తండాలో డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కావున ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసే విధంగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలన్నారు.తాళ్ల ఊకల్ గ్రామాన్ని గెలిచిన తర్వాత నూతన మండలంగా ఏర్పాటు చేస్తానన్నారు.అలాగే ప్రజల సౌకర్యం మద్దిరాల రోడ్డును డబల్ రోడ్డు గా మారుస్తానన్నారు.ఇల్లు రాని వారికి అర్హులైన అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరి చేస్తానన్నారు. గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లను వేస్తానన్నారు. గ్రామాలలో,తండాలలో నీటి కొరత లేకుండా ప్రతి ఇంటికి నల్ల బిగించి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీళ్లను ఇస్తున్నామన్నారు.గత ప్రభుత్వ పాలనలో తండాల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు.నీళ్లు లేక కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకొచ్చేవారని అలాంటి కష్టాలు పడవద్దని నీటి సౌకర్యం కల్పించామన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు,పంట పెట్టుబడి కోసం రైతుబంధు,రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రైతు బీమా ను పండించిన పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందన్నారు.అధికార దాహం కోసం వచ్చి అబద్దాల హామీలు మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి అభివృద్ధి చేసే నాయకుడిని దూరం చేసుకోవద్దని ప్రజలను కోరారు. గత ప్రభుత్వ పాలనలో కరెంటు షాక్ తో చనిపోయిన రైతులే ఎందరో ఉన్నారన్నారు. ఎరువులు అందక క్యూలైన్లో నిలబడి చనిపోయిన రోజులు రైతులు గుర్తుంచుకోవాలన్నారు. డోర్నకల్ నియోజకవర్గాన్ని రోడ్ల మయంగా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల అభివృద్ధికి కట్టుబడి సీఎం కేసీఆర్ పని చేస్తున్నానన్నారు.ఎన్నికల గెలిచిన తర్వాత ఒకే సారి దళితులందరికీ దళిత బంధు ఇస్తామన్నారు.గ్రామ తండాలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడవాళ్ళ కోసం 400 వందల రూపాయలకే గ్యాస్, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు 3000 వేల రూపాయల జీవన భృతి,మహిళలకు సంఘ భవనాలు,వితంతు,ఆసరా, వికలాంగుల పెన్షన్లను పెంచి ఇస్తామన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. మరో మారు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి అభివృద్ధి చేసిన నాయకుడికే అవకాశం కల్పించాలన్నారు. 30 తారీఖున కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు నాయక్,జడ్పీటీసీ శారదా రవీందర్ నాయక్,పిఎసిఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,మహిళా అధ్యక్షురాలు రాంపల్లి అశ్విని,ఎంపీటీసీ కొమ్ము నరేష్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా నాయకురాలు మారి పెళ్లి మాధవి,సర్పంచ్ లు భూక్యా మాల్సూర్,అజ్మీరా బేబీ రాణి రెడ్డి,గుడిపూడి శ్రీనివాసరావు, ఎల్లంపేట సర్పంచ్ తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎంపిటిసి రఘురాం బీఆర్ఎస్ నాయకులు బోల్ల గాని శ్రీను,వివిధ గ్రామాల సర్పంచులు,వార్డ్ మెంబర్లు, ప్రజలు ఇంకా తదితరులు పాల్గొన్నారు.