ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఉమ్మడి రేగొండ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పకాల నరసయ్య ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పకాయల నరసయ్య మాట్లాడుతూ గోరికోతపల్లి మండలం ఏర్పాటు చేసినట్లే చేసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తప్పించుకున్నాడని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండలంలో చేస్తున్న అభివృద్ధి కనబడడం లేదా అని అన్నారు. ఇప్పటికే గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు నిర్మాణానికి పూర్తి కావస్తున్నాయని అన్నారు. వారం రోజుల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహం చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారని గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన మీకు జ్ఞానం రాలేదా అని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పై ఆరోపణ చేస్తే ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు పున్నం రవి, నాయకులు సుదర బోయిన ఓం ప్రకాష్, పట్టెం శంకర్, పొనుగంటి వీరబ్రహ్మం, గండి తిరుపతి, తోకల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.