అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ప్రజలకు అనుగుణంగా పనులు జరగాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. షేక్పేట్ ఓయూ కాలనీలో సీసీ రోడ్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు, రెండులు కలిపి మొత్తం 1 కోటి 24 లక్షల రూపాయల విలువైన పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నవీన్ యాదవ్, అజారుద్దీన్, స్థానిక కార్పొరేటర్ రషీద్ ఫరాజుద్దీన్ పాల్గొన్నారు. అనంతరం, ఓయూ కాలనీలోని వినాయక మండపాలను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆలయ కమిటీ , మండప నిర్వాహకులు సన్మానించారు.