
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం పరిధిలో గల జరుగబోయే బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెట్ల వెడల్పు , కోనేరు, మంచినీరు బావి పనులకు మంజూరి ఇవ్వడం జరిగిందని మరియు కొత్తపల్లి నుండి బుగులోని జాతరకు రోడ్డు, తిరుమలగిరి నుండీ బుగులోని జాతర వరకు రోడ్డు మరియు జగ్గయ్య పేట నుండి బుగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణ పనులకు 5.5 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగిందని ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మరియు గుత్తేదారులకు సూచించారు.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణ రెడ్డి,భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య,ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు,పంచాయతీ రాజ్ అధికారులు,మిషన్ భగీరథ అధికారులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినారు.అనంతరం దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు.