అయినవోలు శివ సాయి వైన్స్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు! ఈ69న్యూస్ ఐనవోలు: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగిన వెంటనే అయినవోలు మండల కేంద్రంలోని శివ సాయి వైన్స్ షాప్లో షాప్ మూసివేసి వెనుకాల అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేకుండా షాపు వెనుకాల తెరిచి దందా సాగుతుందంటూ గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.