
ఈ69న్యూస్ హన్మకొండ:అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.ఆఖేరు వాగు నుండి కొత్త నీటిని తీసుకురాగా,ఒంటిమామిడిపల్లి సహా పరిసర గ్రామాల మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి వర్షాభివృద్ధి,పంటలు బాగా పండాలని ఆశిస్తూ ఘటాభిషేకం నిర్వహించారు.దేవాలయ ప్రాంగణంలోని శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ప్రధాన అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,వేద పారాయణదారులు మధుకర్ శర్మ,పురుషోత్తం శర్మ,వినాయక జోషి,అర్చకులు భానుప్రసాద్ శర్మ,మధు శర్మ,నరేష్ శర్మ,మడికొండ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.