ఈ69న్యూస్ అయినవోలు జూలై 31 తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్,ఐపీఎస్ ఇవాళ అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికి,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.స్వామివారి దర్శనం అనంతరం,ఆయనకు శేష వస్త్రాలను సమర్పించి ఆశీర్వచనం చేశారు.అలాగే తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్,ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ,వేద పారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి,అర్చకులు పాతర్లపాటి నరేష్,నందనం మధు,ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే పోలీసు ఉన్నతాధికారులు,స్థానిక సీఐ,ఎస్ఐ హాజరయ్యారు.ఈ వివరాలను దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.