అయ్యప్ప పీఠం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
కన్నుల పండుగ గా అయ్యప్ప అభిషేక కార్యక్రమం తిలకించిన అయ్యప్ప భక్తులు
శబరిమలలో చేసిన విధంగా అయ్యప్ప కి పంచమృతాలతో అభిషేక కార్యక్రమం కనులపండుగగా తిలకించిన భక్తులు
తల్లాడ మండలం మల్లారం గ్రామం లో అయ్యప్ప పీఠం లో కటికి. కిరణ్ కుమార్ తమ్ముడు సీతారామయ్య వీరి ఇద్దరి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.శబరిమల వెళ్ళలేని భక్తులకు వారి కోరిక నెరవేరింది.అక్కడ అయ్యప్ప కి పంచామృతాలతో ఏ విధంగా అయితే అభిషేకం జరుగుతుందో సాక్షాత్తు అదేవిధంగా మల్లారం పీఠం లో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం,అభిషేకం జరిగింది. అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో, పూజ కార్యక్రమం నిర్వహించారు.అయ్యప్ప కి పంచామృతాలతో అభిషేకం, అయ్యప్ప ను దర్శనం చేసుకునేటప్పుడు ఎక్కే 18 మెట్ల పై పడి వెలిగించి, శబరిమల వెళ్లి అయ్యప్ప ని కనివి తీర చూసినంత అంత గొప్పగా ఆ పడి పూజ మహోత్సవం జరిగింది.అయ్యప్ప పాటలు పడుతూ స్వాములు భజన చేస్తూ, పేట తుల్లి అడినారు. మల్లారం అయ్యప్ప పీఠం పెట్టి నేటికీ 10 వసంతాలు పూర్తిచేసుకుని 11 వ వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది. గురుస్వామి ఎర్రి నరసింహారావు, ధనకొండ క్రిష్ణయ్య స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పీఠం చాలా చక్కగా స్వాములు 41 రోజులు దీక్ష చేస్తూ ఒకటే రోజు ఇరుముడి కట్టించుకొని శబరిమల యాత్ర కి బస్సు లో బయలు దేరి వెళ్తారు. అనేక తీర్ధ యాత్రలు కన్నె స్వాములు కి ఒక వారం పాటు దేవాలయాలు అన్ని దర్శనం చెంచుకొని వస్తారు.ఈ కార్యక్రమం లో గురు స్వాములు ఎర్రి. నరసింహారావు, బెల్లం కొండ. శ్రీనివాసరావు, దుగ్గి దేవర తిరుపతిరావు, కటికి. కాంతారావు, గుడిపల్లి. సత్యం, భూక్యా. బాలయ్య, కొమ్మినేని. రామయ్య, తదితరులు స్వాములు పాల్గొన్నారు.