అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జనవరి 13 నుండి 24 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లబుద్ధారం గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారి సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మన నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల అనేక మంది అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మూడుగురు ప్రయాణించడం చేయకూడదని, అనుమతించిన వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రమాదాల వల్ల వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేశారు. ఈ అనుభవాలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించాయని ఎస్పీ తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ అధికారు