అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం, గ్రామ సర్పంచి అభ్యర్థిగా బిజెపి, పార్టీ నుండి కుందూరు లలిత, మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా కుందురు లలిత మహేందర్ రెడ్డి, మాట్లాడుతూ… దేవాదుల కెనాల్ ద్వారా రెండు పంటలకు రైతులకు నీళ్లు వచ్చే విధంగా ఇండ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేక చొరవతో గ్రామానికి అందేలా పెండింగ్ లో ఉన్న ఆసరా పింఛన్లు వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంజూరు అయ్యేవిధంగా ఉజ్వల యోజన పథకం ద్వారా పేద ప్రజలకు గ్యాస్ పొయ్యిలు ఇప్పించడం ఉపాధి లేని యువతకు ప్రధానమంత్రి, ముద్ర యోజన ద్వారాలోన్ ఇప్పించడం యువతను వికాసం వైపుకు తీసుకువెళ్లడం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అయిన వేడుకల కోసం శాశ్వత వేదిక తయారు చేయడం ధర్మజాగరణ విశ్వహిందూ పరిషత్ ద్వారా సహకారం రామాలయం నిర్మాణం ఏర్పాటు చేయటం పిల్లలకు ఆటల గ్రౌండ్ ఏర్పాటు చేయడం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. డిసెంబర్ 11న మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.