అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం లింగామారిగూడెం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గాడుదుల రాములు బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తానని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని గ్రామంలో డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని పింఛన్లు రానివారికి పించిని వచ్చేటట్లు చేస్తానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న వార్డు సభ్యులుగ ఒకటో వార్డు గోరే సాహెబ్, రెండో వార్డ్ కలీం పాషా, మూడవ వార్డ్ షేక్ ముంతాజ్, నాలుగో వార్డ్ సమీనా, సుల్తాన్, ఐదో వార్డ్ కృష్ణమూర్తి, ఆరో వార్డు పిడుగుల కోమల, ఏడో వార్డు దామెర మల్లయ్య, ఎనిమిదో వార్డ్ గర్వందుల సుజాత, గుల్ మహామ్మద్ మండల అన్వేష్ వారి వారి గుర్తులకు ఓటు వేసి సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తాయని, ఈ సందర్భంగా అన్నారు.