ఆటో అదుపు తప్పి డ్రైవర్ మృతి
మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మాదిరిపురం గ్రామ సమీపంలో ఖమ్మం-వరంగల్ 365 జాతీయ రహదారి ప్రక్కన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన చిర్ర నరేష్ (28) తన అత్తవారి ఊరు అయిన ఖమ్మం జిల్లా సుబ్లేడ్ గ్రామానికి తన అప్పి ఆటోలో ఒంటరిగా వెలుతున్నాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన నరేష్ అక్కడి అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, (19 రోజులు) కుమారుడు (18 నెలలు) కలిగి ఉన్నారు. నరేష్ కొంత కాలంగా హైదరాబాద్లో ఉంటు కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. నరేష్ మృతితో అటు అత్తగారి ఊరి సుబ్లేడు. స్వగ్రామం రాంపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.