
ఆడబిడ్డల పెళ్లిళ్లకు బాకీ ఉన్న తులం బంగారం
ఆడబిడ్డల పెళ్లిళ్లకు బాకీ ఉన్న తులం బంగారం కోసం స్థానిక ఎన్నికలల్లో కాంగ్రస్ పార్టి నాయకులను నిలదీయాలి.
నర్సంపేట రూరల్ మండంలోని రామవరం మరియు రంగం పల్లెగ్రామలలో ఈ రోజు BRS గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షులు జినుకల విజేందర్ గారి అద్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమం లో రామవరం మాజీ సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ కోడారి రవి గారు మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇస్తానని తప్పుడు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిందని అధికారం లోకి వచ్చిన తరువాత బంగారం ఇవ్వకుండా మోసం చేస్తుంది అని పెళ్ళిళ్ళు జరిగిన ఆడబిడ్డలు తులం బంగారం కోసం కాంగ్రస్ పార్టి నాయకులను స్థానిక ఎన్నికలల్లో నిలదీయాలని .కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డు ద్వార ప్రచారం చేసి BRS అభ్యర్ధులను గెలిపించడం కోసం కార్యకర్తలు అందరూ కలిసి కృషీ చేయాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమలో పాల్గొన్న వారు వడ్లకొండ కిషన్. మోతేరాజిరెడ్డి.మాడగని జయకృష్ణ . ఈరెల్లి సాంబయ్య. జినుకల మొగిలి. నాసు బాబు. ఆరేపల్లి రాజేందర్. మాడగాని రాజయ్య. ఎండి యాకుబ్. శనిగరం సురేష్. తది తరులు పాల్గోన్నారు.