ఆత్మకూరు "గడి "వద్ద సినిమా చిత్రీకరణ
షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న “ప్రొడక్షన్ నెం. 2 సినిమా చిత్రీకరణను బుధవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం లో గల పురాతన కట్టడమైన గడి వద్ద చేపట్టారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సి. ఐ ఆర్. సంతోష్ హాజరై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. సినిమా దర్శకుడు నేరెళ్ల దేవేందర్ ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా సదురు సినిమా చిత్రీకరణ నిమిత్తం ములుగు జిల్లా లోని వెంకటాపూర్ మండలం తోపాటు హన్మకొండ జిల్లా లోని ఆత్మకూరు మండలం లోని పలు ప్రాంతాల్లో లొకేషన్ల ను గుర్తించి ఆయా ఆయా ప్రాంతాల్లో సినిమా ను తీసేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఆత్మకూరు లోని పురాతన కట్టడమైన గడి (భవనం ) లో పటేల్ క్యారెక్టర్ చేస్తున్న దామోదర్ గౌడ్ ఫై సినిమా సన్నివేశాలను తీసే పక్రియలో భాగంగా సి. ఐ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా సి. ఐ సంతోష్ మాట్లాడారు. ఆత్మకూర్ గడి వద్ద సినిమా షూటింగ్ చేయటం సంతోషంగా ఉందని అన్నారు. షైన్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూనిట్ సభ్యులు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో గడి ఓనర్ ప్రవీణ్ రెడ్డి, సినిమా ప్రొడ్యూసర్ వేణు యాదవ్, హీరో,హీరోయిన్ లతో పాటు మూవీ డైరెక్టర్ నేరెళ్ల దేవేందర్, కో డైరెక్టర్ ఆర్య అరవింద్, లిరిక్స్ రైటర్ రాజ్ కుమార్, మూవీ ఎడిటర్ యూనిక్, డిఓపి తరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్ లోకేష్, ప్రొడక్షన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్, యూనిట్ సభ్యులు సిద్దు, రఘు, రాహుల్, రఘుపతి, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.