ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ
బలవన్మరణానికి పాల్పడిన ఘటన నర్సంపేట డివిజన్లో చోటుచేసుకుంది.ఖానాపురం,చెన్నారావుపేట మండలాల పరిధిలో ఎండీ. ఆసిఫ్ (57) స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) ఎస్సెగా విధులు నిర్వహిస్తున్నాడు.నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ఆసిఫ్ కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం విధులకు సైతం హాజరై రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.చికిత్స నిమిత్తం గత రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఇక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.