ఆదర్శ పాలనకు అవకాశం ఇవ్వండి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాగాపురం గ్రామం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బి. ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గ నల్ల పద్మ నాగిరెడ్డి సర్పంచ్ బరిలో ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామంగా పేరొందింది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులు మంజూరు చేయించినారు. భారతదేశం లోని గ్రామీణ స్థాయిలో మా గ్రామానికి ఆదర్శవంత పాలన అవార్డు దక్కింది బి.ఆర్.ఎస్ పాలన నుండి ఎందరో లబ్ధి పొందినారు. గ్రామస్తులకు విజ్ఞప్తి బి.ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నల్ల పద్మ నాగిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు . ఆశీర్వదించండి అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే బాధ్యత మాదేనని మీడియాతో అన్నారు. ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.