
ఈ69 న్యూస్ జఫర్ఘడ్,మార్చి 16
హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మందపూరి సంపత్ (మేస్త్రి) ఇటీవల (05-03-2026) మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామంలోని వాలీబాల్ యూత్ సభ్యులు తమ వంతు సహాయంగా కుటుంబానికి 50 కిలోల బియ్యం సంచి అందజేశారు.ఈ సహాయ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పిట్టల నాగరాజు, ఉపాధ్యక్షులు చిడిమిల్ల మల్లన్న, సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణ, శివమణి, నితిన్, నాగరాజు, మహేష్, నవీన్, రాకేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు.