ఆరోగ్యమే మహాభాగ్యం
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320-ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య
ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అత్యంత కీలకమని,ఆరోగ్యం బాగుంటేనే జీవనంలో ఏదైనా సాధించగలమని లయన్స్ ఇంటర్నేషనల్ 320-ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్రశేఖర్ ఆర్య పేర్కొన్నారు.స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో,లయన్స్ క్లబ్ శివునిపల్లి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో గుండె జబ్బులు,కీళ్ల నొప్పులు,కంటి సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు.సుమారు 150 మందికి పైగా ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా లయన్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ..లయన్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు లయన్ మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా శివునిపల్లి లయన్స్ క్లబ్ ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 320-ఎఫ్ జిల్లా తొలి ఉప గవర్నర్ లయన్ పుట్టా హరికిషన్ రెడ్డి,మాజీ జిల్లా గవర్నర్ లయన్ కొత్తపల్లి జాన్ బన్నీ,రీజియన్ చైర్మన్ లయన్ పొన్నాల,సంయుక్త రీజియన్ కార్యదర్శి లయన్ బొమ్మినేని నర్సింహారెడ్డి,హై స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లయన్ కుసుమ రమేష్,జోన్ చైర్మన్ లయన్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే లయన్స్ క్లబ్ శివునిపల్లి అధ్యక్షుడు లయన్ గౌరిశెట్టి అనిల్,చార్టర్ అధ్యక్షుడు లయన్ మంగు జయప్రకాశ్,కార్యదర్శి లయన్ పులి వినయ్ కుమార్,మాజీ అధ్యక్షుడు లయన్ మహ్మద్ దస్తగిరి,జఫర్‌గఢ్ క్లబ్ అధ్యక్షుడు లయన్ మామిడాల పూర్ణచందర్,ఘనపురం క్లబ్ అధ్యక్షుడు లయన్ కోతి అశోక్,మాజీ జోన్ చైర్మన్ లయన్ ఆమంచ మధుసూదన్,సభ్యులు లయన్ తుమ్మనపల్లి కిరణ్,లయన్ మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.మెడికవర్ హాస్పిటల్ వైద్యులు షఫీ,వినీత్,కార్తీక్,శరత్‌తో పాటు ఐ విజన్,వాసన్ ఐ కేర్ సిబ్బంది ఈ శిబిరానికి వైద్య సహకారం అందించారు.