
ఆర్టీసీ డ్రైవర్ల వేగం ప్రాణాలకే ముప్పు
అతివేగం ఆరోగ్యానికి హానికరం అని బస్సుల్లో రాసుకొని బస్సు డ్రైవర్లే సునామిలా దూసుకుపోతున్నారు:
పరకాల ప్రజలు పరకాల ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్ల వేగం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.హన్మకొండ నుంచి పరకాలకు వచ్చే బస్సులు చాలా అతివేగంగా నడుపుతున్నారు.అలాగే భూపాలపల్లి డిపో బస్సులు కుడా వేగంగానే వస్తున్నాయి. ఇలా నడిపితే
ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి.రోడ్డు మీద ఇరుపక్కల కాలినడకన నడిచే ప్రజలకు నడవలేని పరిస్థితులల్లో ఉన్నామని ప్రజలు వాపోతున్నారు.పెట్రోల్ బంక్ దగ్గర ప్రమాదం చావు బ్రతుకుల్లో ఆ మనిషి ఉన్నారు. ఇలాంటి సంఘటనలకు కారణం డ్రైవర్లకు ట్రిప్పుల టార్గెట్ వల్లె డ్రైవర్లు గాలిలో సునామిలా వెళుతున్నారా… లేక వారియొక్క వ్యక్తిత్వంలో ఇలాంటి వేగం ఉందా… పరకాల డీఎమ్ ఈ సమస్యను గమనించగలరని డ్రైవర్ల అతివేగం డ్రైవింగ్ పైన ద్రుష్టి సారించాలని పరకాల ప్రజల యొక్క విన్నపం అలాగే వేగం తగ్గని యెడల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.