ఆసిఫాబాద్:పత్తి చేనులో పసికందు కలకలం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో గుడ్డలో కట్టి పడేసిన పసికందును స్థానికులు గుర్తించారు. శనివారం ఉదయం చేనుల వైపు వెళ్లిన గ్రామస్థులకు శిశువు అరుపులు వినిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, సంచిలో చుట్టి పడేసి ఉన్న ఆడ శిశువును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ విషయాన్ని బాల సంరక్షణ అధికారులకు తెలియజేయడంతో అధికారి మహేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని, ఒక రోజు వయసున్న ఆ శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నపేగు బంధాన్ని తెంచుకుని పసికందును ఇలా వదిలేసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.