జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సి కాలనీలో నివసించే పలువురు నిరుపేదులు,తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదనే ఆవేదనతో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇళ్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పినా,తమ పేర్లు జాబితాలో లేకపోవడంపై వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.స్థానికులు మాట్లాడుతూ..ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని,వాస్తవానికి అన్ని విధాలా ఆర్థికంగా బలమైన వారికే ఇళ్లు కేటాయించారన్నారు."మేము నిజమైన నిరుపేదలు,పని చేయకపోతే తినే పరిస్థితి కూడా లేదు.కానీ మాకే ఇళ్లు రాలేదని బాధితులు వాపోయారు.ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా దృష్టి సారించి,తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.అవసరమైనవారికి మాత్రమే ఇళ్లు మంజూరవ్వాలని,అర్హుల జాబితాలో తిరిగి పరిశీలన జరిపి తాము లాంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.