ఇందిరమ్మ ఇళ్ల సర్వే,నిర్మాణ పనులు వేగవంతం చేయాలి–కలెక్టర్ రిజ్వాన్ బాషా ఈ69న్యూస్ జనగామ: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ దరఖాస్తుల సర్వే,మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ఇప్పటివరకు జిల్లాలో 90% సర్వే పూర్తయినప్పటికీ,మిగిలిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు.ఇకపై 12 పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని,బేస్మెంట్ దశ పూర్తయిన ఇండ్లకు నగదు చెల్లింపులు సకాలంలో జరగాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.