బురదమయంగా కాలనీలు
- బురదమయంగా కాలనీలు.. పట్టింపులేని పాలకులు.. • గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు
ఇప్పుగూడెం రెండో వార్డులో గృహ సముదాయాల
మధ్య నిలిచిన మురుగునీళ్లు
స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 26 (తెలుగు గళం): మండలంలోని ఇప్పగూడెం గ్రామం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామమైన
ప్పటికే అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉంది. అందుకు నిదర్శనం గ్రామంలోని పలు వీధుల్లోని రోడ్ల దుస్థితే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని 1, 2, 3వ వార్డుల్లోని పలు రోడ్లు పూర్తిగా బురదకూపంగా మారి అటుగా వెళ్లే వారు కాలు తీసి కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామంలోని పాత నుంచి రంగరాయ గూడెం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. గుంతల్లో నీరుచేరడంతో రోడ్డు మీదుగా నడిచే వాళ్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ వార్డులోని గృహ సముదాయాల మధ్య నెలకొన్న బురదకూపం కుంటను తలపిస్తోంది. చుట్టు పక్కల గృహాల వారు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక రోజులుగా నీళ్లు నిల్వగా మారి ఉండడంతో దుర్గందం వస్తుందని సమీప గృహాలకు చెందిన వారు వాపోతున్నారు. గ్రామంలోని కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్డు పైన మోకాలు లోతు బురద ఏర్పడడంతో వాహనదారులు రోడ్డుమీదుగా వెళ్లేందుకు నరకయాతన పడుతు న్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత
అధికారులు మేలుకొని రోడ్ల అభివృద్ధి పైన, గృహ సముదాయాల మధ్య నిలిచిన నీళ్లు తొలగించే చర్యలు చేపట్టేలా దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.