
ఈ69న్యూస్ ఐనవోలు మార్చి 16
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్థానిక మస్జిద్ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గ్రామ సర్పంచ్ గుడ్డేటీ ఏలియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుని కలిసిమెలిసి జీవించాలని ఆయన కోరారు.గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు సామరస్యానికి దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఎండి మైబల్లి, మౌల్వీ యాకూబ్ పాషా ఖుర్రం,అలాగే ఉప సర్పంచ్ ధోనికెల వెంకటేష్, 6వ వార్డు మెంబర్ గుడ్డేటి శ్రావణ్ కుమార్, 4వ వార్డు మెంబర్ ఎండి అజారుద్దీన్,గుంషావలీ, తదితర ముస్లిం సోదరులు పాల్గొని ఉపవాస విరమణ చేసి ప్రార్థనలు చేశారు.