ఇస్లాంలో మాదక ద్రవ్యాలు వినియోగం నిషేధం
Telangana, Warangalప్రతీ అహ్మదీ ముస్లిం మద్యం,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి-ముహమ్మద్ సలీం
ఈ69 న్యూస్,వరంగల్/రాయపర్తి
మాదక ద్రవ్యాలు వినియోగించడం ఇస్లాంలో పూర్తిగా నిషేధం.ప్రతి అహ్మదీ ముస్లిం మద్యం,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన సమితి (మజ్లిస్ అన్సారుల్లాహ్) అధ్యక్షుడు ముహమ్మద్ సలీం పిలుపునిచ్చారు.రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామంలో,కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా అధ్యక్షతన జరిగిన వయోజన సమితి వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమాజ సంస్కరణలో వయోజనుల పాత్రముహమ్మద్ సలీం మాట్లాడుతూ..సమాజం మరియు ప్రపంచ సంస్కరణలో వయోజనులు కీలక పాత్ర పోషించాలన్నారు.మద్యం,ధూమపానం,మత్తు పదార్థాల వినియోగం యువతను బానిసలుగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ముందుగా తమను తాము ధార్మికంగా,నైతికంగా మెరుగుపరుచుకొని,తమ సంతానానికి మంచి మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
ఖిలాఫత్-అల్లాహ్ ప్రసాదించిన ఆశీర్వాదంముస్లింల ఏకతా మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఖిలాఫత్ వ్యవస్థ ఒక అల్లాహ్ ప్రసాదించిన మహా ఆశీర్వాదమని గుర్తుచేస్తూ,ప్రతి అహ్మదీయ ముస్లిం ఖలీఫతుల్ మసీహ్ పట్ల ప్రేమ,విధేయత,గౌరవాన్ని హృదయంలో దృఢంగా కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ఖిలాఫత్ పట్ల ఉన్న అనుబంధం మన ఆచరణలో,సేవలో,మరియు సమాజం పట్ల త్యాగంలో ప్రతిబింబించాలన్నారు.
ధార్మిక ఉపదేశాలు-బహుమతుల ప్రదానంకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రచారం కార్యదర్శి మౌల్వీ షబ్బీర్ అహ్మద్ యాకూబ్,సర్కిల్ ఇంచార్జి మౌల్వీ ఆసిఫ్ ఖాదిం వయోజనులకు పలు ఆధ్యాత్మిక ఉపదేశాలు అందించారు.నేటి ప్రపంచంలో నిజమైన ధార్మికత లోపించిందని,అందువల్ల అహ్మదీయులు ధార్మికాభివృద్ధి, ఖిలాఫత్ పట్ల విధేయత,మరియు సత్యమార్గంలో నడిచే జీవన విధానం వైపు దృష్టి పెట్టాలని సూచించారు.తరువాత క్రీడా మరియు ధార్మిక విద్యా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
పాల్గొన్న ప్రముఖులుఈ సమావేశంలో కాట్రపల్లి గ్రామ సదర్ నాసిర్,ఖుర్బాన్ అలీ,నూరుద్దీన్,యాకూబ్,ఖాజామియా,నాసర్,సత్తార్ ముస్తఫా,ఖలీల్,మౌల్వీ ఇక్బాల్,మౌల్వీ అయాన్ పాషా,అల్లిసాబ్,నాసిర్ ఖాదర్, మక్తుం అలీ,మౌల్వీ మస్తాన్,బషీర్,ఆస్ఘర్,వలీ,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.