ఈత చెట్టుపైనుండి జారిపడి గీత కార్మికుడు మృతి
మరిపెడ మండలం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు పోగుల సత్యం (60) ఆదివారం కల్లు గీసే క్రమంలో ఈత చెట్టుపైనుండి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పోగుల సత్యం రోజు మాదిరిగానే కల్లు గీత కోసం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనాస్థలంలోనే మృతి చెందారు.మృతుడు పోగుల సత్యంకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో గ్రామంలో, గౌడ సంఘంలో విషాదఛాయలు అలుముకున్నాయి