ఈ నెల 14న తెలుగుగళం కథనం ప్రచురణ"స్పందించిన ముఖ్యమంత్రి
మైనారిటీ యువ మహిళకు దక్కిన సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం
ఈ నెల 11 న ప్రతిష్ఠాత్మకoగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పోరులో ఖమ్మంజిల్లా సత్తుపల్లి పురపాలక సంఘంలో ఈ నెల13 న జరిగిన కౌంటింగ్ లో 23 వార్డులకు గాను కాంగ్రెస్ 17,బి.ఆర్.ఎస్.6 వార్డులను చేజిక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే.
అనంతరం సోమవారం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు.అందుకే ఈ నెల 14 న మైనార్టీలకు చైర్మన్ పీఠం దక్కేనా అని తెలుగుగళం తెలుగు జాతీయ దినపత్రిక RC మల్లూరు చంద్రశేఖర్ రాసిన కథనం కూడా పాఠకులకు విదితమే.దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లు పట్టణంలో 22 వార్డులో కాంగ్రెస్ నుండి కౌన్సిలర్ గా 280 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మైనారిటీ కు చెందిన కమాల్ పాషా సతీమణి ఎండి రెహానా బేగం కు(యువ మహిళకు)సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం ఇచ్చారు.దీంతో పట్టణంలోని మైనారిటీ వర్గాలలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.