ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు
ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో ప్రభుత్వ సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తిస్తారని,అందువల్ల వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు.ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా రక్తపోటు,షుగర్, హీమోగ్లోబిన్,బరువు తదితర ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సూచనలు అందించడం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.త్వరలో స్పెషలిస్ట్ వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి సిబ్బందికి సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఉద్యోగి కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ, ఆరోగ్యవంతమైన సిబ్బందే సమర్థవంతమైన పరిపాలనకు బలమని ఆయన పేర్కొన్నారు.ఉద్యోగుల ఆరోగ్యం కాపాడటం ద్వారా ప్రజలకు సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డా. మాడ్గుసూదన్, బాబూరావు, డా. కుమారస్వామి, ఫణి కుమార్, డా. వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, రాధిక, స్వాతి, టీఎన్జీవో ప్రతినిధులు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వైద్య బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, సేవల నాణ్యత పెంపు లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.