ఉపాధ్యాయుల ఉద్యోగాలకే ఎసరు పెడతారా ఆకునూరి మురళి?
ఉపాధ్యాయుల జీతాలు, ప్రమోషన్లలో చేసిన సూచనలకు ఖండన ఆకునూరి మురళి విద్యాసంస్కరణలో చెప్పిన సంస్కరణలను కొన్నింటిని ఆహ్వానిస్తూ ఉపాధ్యాయుల జీతాలు ప్రమోషన్స్ విషయంలో చేసిన సూచనలను ఖండిస్తున్నామని పీఆర్టియు మరిపెడ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో భవిష్యత్తులో నియామకాలు అని చెప్పినప్పటికీని సరైన సూచనలు కావన్నారు. విద్యా వ్యవస్థ గురించి చెప్పమంటే ఉపాధ్యాయులు జీతాల గురించి చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ జీతాలలో పాటు అనేక పదవులు,ఇతర ఉన్నత ఉద్యోగులపై పెట్టే ఖర్చు కూడా అదనంగా ఉన్నదన్నారు. వాటిని కూడా తగ్గించి విద్యా వ్యవస్థకు పెడితే బాగుంటుందని చెబితే బాగుండేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా విధానాన్ని గురించి అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాలని చూస్తారనుకుంటే ఇలాంటి సలహాలు ఇవ్వడమేమిటని
ప్రశ్నించారు.అక్కడ ఉపాధ్యాయుల జీతాలు కూడా ఇక్కడ అమలు చేస్తే బాగుంటుంది కదాఅని వ్యాఖ్యానించారు. వీరి యొక్క సూచనలలో ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ ఏ మేరకు విజయవంతం అయిందో ఆనాటి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. పాత ఒక రోత కొత్త ఒక వింతలా ఇంగ్లీష్ మీడియం గురించి అందరూ చెప్పినవే గాని చైనా లాంటి దేశాలు మాతృభాషతోనే అంత అభివృద్ధి సాధించాయో అధ్యయనం చేయవలసి అవసరం ఎంతైనా ఉందన్నారు. అల్పాహారం కిట్స్ మొదలైన సౌకర్యాల గురించి కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయన్నారు. ఇక పబ్లిక్ స్కూల్లో విషయానికొస్తే ప్రాథమిక స్థాయి విద్యార్థి ట్రాన్స్పోర్ట్ విషయంలో పడుతున్న ఇబ్బందులు గురించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభిప్రాయాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేట్ స్కూల్స్ ఇబ్బడి ముబ్బడిగా నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అనుమతి పొందిన పాఠశాలల అనుమతి రద్దు చేయాలి అనే సిఫార్సు ఉంటే బాగుండేదన్నారు. ఎన్ సి టి ఈ నిబంధన ప్రకారం ఏ వయసు ఏ తరగతి వారికి ఏ అర్హత ఉన్నవారు బోధించాలో వారికి ఏ కోర్స్ అవసరమో నిబంధనలు చెబుతున్నాయన్నారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని వివరించారు. ఇంగ్లీష్ అతి ముఖ్యమే గాని ఇంగ్లీష్ నే మాతృభాషగా రూపొందించే చర్యలు ఉండకూడదని పేర్కొన్నారు. సూచనల కొత్తదనం ఉండాలికాని గత కొంతకాలంగా ఈ సూచనలు ఏదో ఒక రకంగా సంఘాల ద్వారానో, అధికారుల ద్వారానో ప్రభుత్వానికి చేరుతున్నవేనన్నారు. విద్యా వ్యవస్థ మెరుగుదలకు సూచనలు ఇవ్వాలని కోరితే జీతాలు తగ్గించాలనే సూచనను చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.