జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం ఉమ్మడి రేగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా క్యూలైన్లలో నిలుచున్నారు. పోలీసుల సహకారంతో నిర్వాహకులు ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా చొప్పున పంపిణీ చేశారు.పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం గత నాలుగు రోజులుగా తిరుగుతున్నామని,రైతుకు కనీసం మూడు బస్తాలైన పంపిణీ చేయాలని తమ ఆవేదనను పత్రిక విలేకరులతో పంచుకున్నారు. జిల్లాలో అతిపెద్ద మండలం అయినా ఉమ్మడి రేగొండ మండలానికి అధిక సంఖ్యలో యూరియా బస్తాలు కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులకు రైతులు విన్నవించుకున్నారు.గత ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియానూ అందించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస అవగాహన లేకపోవడం బాధాకరం ఆన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కావలసిన యూరియా నూ వెంటనే అందించి తమ పంటలను కాపాడలని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.