
ఎం.జి.యం సెంటర్లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
ఈ69న్యూస్ వరంగల్: స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఎం.జి.యం సెంటర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ కాంగ్రెస్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్,రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు,మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పాల్గొన్నారు.వారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన దేశానికి చేసిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకున్నారు.రాజీవ్ గాంధీ అందించిన విజన్,యువతపై ఆయన ఉంచిన నమ్మకాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.