ఎన్నికల నివేదికలు త్వరగా సమర్పించాలి
ఐనవోలు,పంథిని క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్,వార్డు స్థానాల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన నివేదికలు త్వరగా సమర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఎంపీడీవో,రిటర్నింగ్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.శనివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఐనవోలు,పంథిని క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్,వార్డు స్థానాల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు.ఐనవోలు క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఐనవోలు,పున్నేలు,ఒంటిమామిడిపల్లి,ఉడతగూడెం గ్రామాలు,పంథిని క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పంథిని,కక్కిరాలపల్లి,పెరుమాండ్ల గూడెం గ్రామాలకు సంబంధించి సర్పంచ్,వార్డు స్థానాలకు ఏకగ్రీమైన వివరాలను ఎంపీడీవో నర్మద,రిటర్నింగ్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఎన్నికల ప్యాక్రియా జరగాలని అన్నారు.విత్ డ్రా అయ్యాయని,ఎన్ని ఏకగ్రీవమయ్యాయని,అభ్యర్థుల నుండి నామినేషన్ల ఉపసంహరణ ఎలా తీసుకుంటున్నారని,ఫారం 9 ఎలా ప్రిపేర్ చేస్తారని,ఏమైనా ఏకగ్రీవాలు అవుతున్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నివేదికలు ఆలస్యం చేయకుండా త్వరగా పంపాలన్నారు.నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో నర్మదా,తహసిల్దార్ విక్రమ్ కుమార్,ఎంపీఓ రఘుపతి రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.