ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట రూరల్ మండలం,లక్నేపెల్లి,రామవరం గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లక్నేపల్లి గ్రామంలో దివంగత మాజీ ప్రధాని శ్రీ స్వర్గీయ పీవీ.నరసింహారావు గారి పుట్టిన గ్రామాన్ని అసెంబ్లీలో మాట్లాడి ఈ గ్రామానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం జరిగింది. గ్రామంలో పీవీ గారి గుర్తింపు చిహ్నంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి నిధులు అత్యధికంగా ఇవ్వడం జరిగింది.మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నారు.రెండు సంవత్సరాలుగా గెలిచిన ఎమ్మెల్యే గ్రామాలలో ఎక్కడ తిరుగలేదు అభివృద్ధి చేయలేదు.వార్డు మెంబర్లు ,సర్పంచ్ ఎన్నికలకు నర్సంపేటలో ముఖ్యమంత్రితో ప్రచారం చేపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.ఇంత దిగజారి స్థానిక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొనడం అనేది చరిత్రలో మొదటిసారి మహిళా గ్రూపులలో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ సంఘ గ్రూపుల పేరు మీద బ్యాంకులో లోన్లు పెట్టి మహిళలకు చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహిళ సంఘాల తో కిస్తీలు కట్టించి చీరల పైసలు వసూలు చేస్తారు. మహిళలకు బాకీ పడ్డ 60,000..మహాలక్ష్మి పథకం నెలకు 2500 ఇవ్వకుండా మోసం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,మండల ఎన్నికల కన్వీనర్,మాజీ ఎంపీపీ,క్లస్టర్ బాధ్యులు,మండల నాయకులు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీ నాయకులు,అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.