ఎన్నికల విధులు చాలా కీలకం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా లింఘాల ఘనపుర్ మండలం బండ్ల గూడెం రైతు వేదిక లో పి ఓ లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించి పలు అంశాల మీద పి ఓ లకు కలిగిన అవగాహన ను కలెక్టర్ స్వయంగా ప్రశ్న లు అడిగి పరీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…రీపోలింగ్ కి ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అన్నారు.ఎన్నికల విధులు చాలా కీలకమైనదని… ప్రతీ అంశం పైన క్షుణ్ణం గా అవగాహన కల్పించుకొని…విధులను నిర్వర్తించాలన్నారు.ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి సేకరించడం,అంత సామాగ్రి సరిగా ఉందో లేదో ఎలా సరిచూసుకోవడం,ఓటర్ లిస్ట్,బ్యాలెట్ పేపర్స్ చెక్ చేసుకోవడం ,బ్యాలెట్ బాక్స్ ఎలా సీల్ చేయాలి,ఛాలెంజ్ ఓటు,టెండర్ ఓటు,బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం,పిఓ డైరీ నింపడం,అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి,ఏజెంట్స్ సిగ్నేచర్ ఎక్కడ తీసుకోవాలి,పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బ్యాక్ సీలింగ్,ఓట్స్ కౌంటింగ్,ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ,సర్పంచ్,ఉపసర్పంచ్ నియామక పత్రాలు ఇవ్వడం ..తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.మాస్టర్ ట్రైనర్స్ కోటి,శ్యామ్ మొహన్,రాఘవులు,హరి ప్రసాద్,రాజ శంకర్ పోలింగ్ ముందు రోజు నుండి కౌంటింగ్ వరకు పి ఓ ల కార్యాచరణ,విధులు,బాధ్యత లు తీసుకోవలిసిన జాగ్రత్త లను పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమం లో మండల తహసీల్దార్,ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు