ఎన్నికల సమయంలోనే ఈ రెండు పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు: నాయిని రాజేందర్ రెడ్డి
Warangalమ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన సాగిస్తున్న వాళ్ళని వెనక్కి పంపాలి.
కాంగ్రెస్ పార్టీని ఆదరించండి.. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ..నాయిని..
ప్రజాదీవన యాత్రలో భాగంగా ఈ రోజు హన్మకొండ 53 వ డివిజన్ లో రంగ్ బార్ నుండి ప్రారంభమై లష్కర్ సింగారం, ఆదర్శ కాలనీ, గోపాల్ పుర X రోడ్, సమ్మయ్యనగర్, సరస్వతినగర్, మాధవనగర్, విజయనగర్ కాలని, మాహాత్మ నగర్, టి.బి. హాస్పిటల్ వెనక వైపు, సహకార్ నగర్ మీదుగా సాగి వాయుపుత్ర కాలని వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
మోడీ బిఆర్ఎస్ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పెట్రోల్, గ్యాస్, డీజిల్ రెట్ల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బతుకు భారమయింది.
పేదరికం, నిరుద్యోగ రేటు తీవ్ర స్థాయిలో చేరాయి. మెకిన్ ఇండియా, హర్ ఘర్ జల్, ఆత్మనిర్భర్, భారత్ లాంటి మోడీ మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి.
విభజన చట్టం ప్రకారం తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను అమలు చేయడంలో బిజేపి ప్రభుత్వం విఫలం చెందింది.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మోడీ పాలనలో దేశంలో తీవ్ర స్థాయిలో చేరిన నిరుద్యోగ రేటు.
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణాలో అభివృద్ధి అంత ఒక కేసిఆర్ కుటుంబానికే పరిమితమైంది. నీళ్ళు, నిధులు, నియమాకాలంటూ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించింది.
మిగూలు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. మ్యానిఫెస్టోలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన కొనసాగితున్నారు.
తోమ్మిదేంట్ల పాలనలో ముఖ్యమంత్రి హోదాలో కే.సి.ఆర్ వరంగల్ కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు వరంగల్ నగరాన్ని వాషింగ్టన్ చేస్తామంటూ కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమయిది?
నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కలగానే మిగిలింది.
బల్ బెడ్ రూమ్ ఇండ్లకు పగుళ్ళు ఏర్పడి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి.
ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్ అసమర్ధత వల్లే ఈ రోజు హన్మకొండ నగరం మునిగింది.
నాళాలు, చెరువులు మరియు ఎఫ్.టి.ఎల్ భూకబ్జాలకు గురవుతుంటే భూకబ్జాదరులపై మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదంటనే ఇందులో మీకు వాటా ఉందని అర్థమవుతుంది.
వరంగల్ నగర కార్పొరేషన్ ప్రజలకు ఇచ్చిన హామీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడికి పోయింది.
ప్రతి ఏటా వరంగల్ నగర ప్రజలకు 300 కోట్లు బడ్జెట్ ఇస్తానన్న హామీ ఎక్కడ ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు బాబా భాయి, ఎర్ర కావ్య మహేందర్, ఏఐసిసి అధికార ప్రతినిధి డాలీ శర్మ, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తం రావు దాల్వి,వరంగల్ వెస్ట్ ఏ.ఐ.సిసి ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, టిపిసిసి మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహీమున్నిస బేగం, సి.పి.ఐ. నాయకులు కర్రే బిక్షపతి తదితరులు పాల్గొన్నారు