ఎన్ ఎస్ పి కార్యాలయాన్ని రైతుసంఘం ఆధ్వర్యంలో ముట్టడించిన రైతులు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
తల్లాడ మండల కేంద్రంలోని ఎన్ఎస్పి కార్యాలయాన్ని తెలంగాణ రైతుసంఘం తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నారుగూడెం,గోపాలపేట, తల్లాడ,నరసరావుపేట, అంజనాపురం,గాంధీనగర్ తండా,వెంకటగిరి రైతులు సిరిపురం,తెలగారం మేజర్లకు నీళ్లు విడుదల చేయాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు.అధికారుల నిర్లక్ష్య సమాధానంతో ఆగ్రహించిన రైతులు ధర్నా నిర్వహించి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఎన్ఎస్పి ఈ. ఈ. కల్లూరు ని రైతుసంఘం జిల్లా నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి చరవాణిలో సంప్రదించగా రెండు గంటల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ధర్నాను విరమించారు.ఈ సందర్భంగా శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి,మిర్చి ఇతర పంటలు అధిక వర్షాలకు చీడపీడలకు నష్టపోయిన రైతులు ఆదుకుంటుందనుకున్నా ధాన్యం పంట అధికారుల నిర్లక్ష్య వైఖరితో నీళ్లు అందక పంట కీలక దశలో నీరు అందకపోవటంతో నష్టానికి గురయ్యే పరిస్థితి ఉందని వెంటనే సంబంధిత అధికారులు అందరూ పర్యవేక్షించే రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను అధిక సంఖ్యలో సమీకరించి చివరి ఎకరం వరకు నీళ్లు ఇచ్చే వరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో: రైతు సంఘం నాయకులు,మాజీ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు, రైతులు: పులి కృష్ణయ్య, గుండ్ల నాగయ్య,శనక్కాయల పెద్ద నరసింహారావు, ఏగుపాటి హనుమంతరావు, పాలవెల్లి ప్రసాద్,సాయిని ప్రకాష్ రావు,అనుములు కృష్ణయ్య,దగ్గుల భద్రారెడ్డి, హరీష్ రెడ్డి,బోడ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.