ఎమ్మెల్యేలకు జాతర ఆహ్వాన పత్రం అందజేత
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరంలో నిర్వహించనున్న వార్షిక జాతర సందర్భంగా ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఆహ్వాన పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య,స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరిలకు దేవస్థానం తరఫున జాతర ఆహ్వాన పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్,దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్,అర్చక సిబ్బంది పాల్గొన్నారు.జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.