ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కొత్తపల్లిగోరి నూతన పోలీస్ స్టేషన్ ఎస్ఐ దివ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపల్లి గోరి మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని,యువతకు ఆదర్శంగా నిలిచి మంచి పేరు సంపాదించుకోవాలని ఎస్సైని ఎమ్మెల్యే కోరారు.