ఈ69న్యూస్ హైదరాబాద్:ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కార్మికులు మే నెల జీతాలు ఇప్పటివరకు అందలేదంటూ నిరసన తెలిపారు.జీతాలు రాక పిల్లల స్కూల్ ఫీజులు,ఇంటి అద్దె,ఇతర అవసరాలు తీరడం లేదని వారు వాపోయారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మే జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే,కార్మికుల కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని,కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని,8 గంటల పని వేళను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.పిక్స్డ్ టర్మ్,ఔట్సోర్సింగ్ విధానాలు తొలగించి కార్మికులను శాశ్వతంగా నియమించాలని డిమాండ్ చేశారు.జులై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రాపర్తి అశోక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్.సైదయ్య,ఓం ప్రకాష్,శ్రీధర్,భాగ్యమ్మ,లక్ష్మి,అమేందర్ తదితరులు పాల్గొన్నారు.