ఈ69న్యూస్ న్యూఢిల్లీ,జూలై 29 తెలంగాణ రాష్ట్రానికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.PM e-DRIVE పథకం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించాలని ఆమె ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు,గ్రామీణ మరియు పట్టణ రవాణాకు కొత్త దిక్సూచి ఏర్పడుతుందని ఆమె అన్నారు.ఎంపీ ప్రశ్నకు స్పందించిన కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..ప్రస్తుతం కేంద్రం ప్రామాణికంగా GCC మోడల్‌ను మాత్రమే ఆమోదిస్తోందని,రాష్ట్రం సూచించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పటి వరకు పథకంలో లేనందున అది పరిశీలనలో ఉందని వెల్లడించారు.ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని విధానాల్లో మార్పులు చేయాలని అభ్యర్థించారు.హైబ్రిడ్ GCC మోడల్ ద్వారా ఉపాధికి సహకారం కల్పించవచ్చని,CESL ద్వారా బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు.