ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన మాదిగలకు ఘన నివాళి
ధర్మసాగర్ మండల కేంద్రంలో అమరవీరుల దినోత్సవం నిర్వహణ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల స్మారకార్థం ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా & అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ హాజరై అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా కొనసాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం అనేకమంది మాదిగ యువకులు త్యాగం చేశారని తెలిపారు.వారి త్యాగ ఫలితంగానే నేడు వర్గీకరణ సాధ్యమైందని, ఈ విజయాన్ని అమరవీరులకే అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో పుట్ట సుధాకర్, మాచర్ల బాబు మాదిగ, పుట్ట ప్రశాంత్ మాదిగ, చిలుక రాజు మాదిగ, కొట్టె శివ మాదిగ, కట్కూరి గోపాల్ రెడ్డి, గంగారపు రాజేందర్ మాదిగతో పాటు పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.