ఎస్.ఆర్.యూనివర్సిటీలో డ్రగ్స్ నిరోధక తనిఖీలు ఈ69న్యూస్ హన్మకొండ:హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ పరిధిలో గల ఎస్.ఆర్ యూనివర్సిటీలో హసన్పర్తి పోలీసులు మరియు యాంటీ డ్రగ్ టాస్క్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా బాయ్స్ హాస్టల్ గదులు,క్యాంటీన్ పరిసర ప్రాంతాలు,పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో గల్లంతుగా తనిఖీలు జరిపారు.విద్యార్థుల వద్ద నిషేధిత పదార్థాలు వున్నాయేమోనన్న అనుమానంతో విస్తృతంగా పరిశీలన చేపట్టారు.ఈ తనిఖీ కార్యక్రమంలో హసన్పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు,యాంటీ డ్రగ్ టీం ఇన్స్పెక్టర్ సతీష్,ఎస్సై దేవేందర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.ఈ చర్యలు యువతను మాదకద్రవ్యాల నుండి రక్షించేందుకు,విద్యాసంస్థల పరిధిలో డ్రగ్ విస్తరణను అడ్డుకునే ఉద్దేశంతో చేపట్టబడినట్లు అధికారులు తెలిపారు.