
ఈ69 న్యూస్ ఐనవోలు,ఆగస్టు 13
ఐనవోలు మండలంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంబులెన్స్‌లో మెడిసిన్,ఆక్సిజన్ సదుపాయాలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని,పరికరాలను సమయానికి పరీక్షించాలని ఆయన సూచించారు.ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు త్వరితగతిన స్పందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పీఎం నసీరుద్దీన్,ఈఎంఈ శ్రీనివాస్,ఈఎంటి లు రాజు,సోమేశ్,పైలెట్లు కొండ తిరుపతి,భాస్కర్ పాల్గొన్నారు.