ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం బి. ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గా ముస్కు సౌమ్య మదన్ మోహన్ బరిలో ఉన్నారు. ముస్కు సౌమ్య మదన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ రేపు డిసెంబర్ 17న జరగబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు సర్పంచిగా గెలిస్తే గ్రామంలో డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని హై స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం వృద్ధాప్య పింఛన్లు అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇప్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను బొమ్మెర పోతన పుట్టినగ్రామాన్ని అభివృద్ధి చేయడం ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేస్తాను బొమ్మెర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అవకాశం ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డని మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి మీ కష్టసుఖాలను పాలుపంచుకుంటాను. నాకు సర్పంచి అభ్యర్థిగా టికెట్టు కేటాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో గ్రామ బి.ఆర్.ఎస్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.