మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని 48 గ్రామ పంచాయతీల్లోని ఓటర్ జాబితా,పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మరిపెడ ఎంపీడీఓ కార్యాలయం సమావేశ హాలులో అఖిల పక్ష నాయకులు,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు,మరిపెడ మండలంలోని 48 గ్రామ పంచాయతీల్లోని 396 వార్డులు, 46,479 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఈ నెల 28న విడుదల చేసినట్లు తెలిపారు.మండలంలోని గ్రామ పంచాయతీల వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని,రాజకీయల నాయకుల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31లోపు తెలియజేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గుగులోతు రవి నాయక్, సురేష్,సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్,సీపీఎం నాయకులు బోడపట్ల రాజశేఖర్ గౌడ్,వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.