ఓటు వేసిన ఓటర్లకు మిఠాయిలు
సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో 21 వ వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్ధి గా మందపాటి ప్రభాకర్ రెడ్డి కు ఓటు వేసి విజయం సాధించి పెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం వార్డులోని గడప,గడపకు ప్రభాకర్ రెడ్డి తన బృందంతో వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వాదం తీసుకుని ఓటర్లకు స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో: వార్డు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.